📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 World Cup 2026: టీమిండియాపైనే ప్రెజర్: షోయబ్ అక్తర్

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు గట్టి సవాలు ఎదురుకానుందని పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. “భారత్‌లో మ్యాచ్ జరుగుతోంది, కాబట్టి సహజంగానే టీమ్ ఇండియాపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. స్వదేశంలో ఆడటం కలిసొచ్చే అంశమైనప్పటికీ, అది ఒత్తిడికి కూడా కారణమవుతుందని విశ్లేషించారు.

Read Also: T20 WC: టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

అహ్మదాబాద్ పిచ్.. 2023 వరల్డ్ కప్ ఓటమి సెగ!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండటంతో, గత అనుభవాలను అక్తర్ గుర్తు చేశారు. “ఇదే గ్రౌండ్‌లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ జ్ఞాపకాలు భారత్‌ను వెంటాడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఒకవేళ 225-250 భారీ స్కోరు సాధిస్తే, భారత్‌కు లక్ష్య ఛేదన కష్టతరమవుతుంది”. అహ్మదాబాద్‌లో సాధారణంగా 175-200 స్కోరు నమోదు కావచ్చని ఆయన అంచనా వేశారు.

T20 World Cup 2026: Pressure on Team India: Shoaib Akhtar

టైటిల్ ఫేవరేట్ భారత్.. కానీ కివీస్ గెలిస్తే!

ప్రస్తుత ఫామ్ ప్రకారం టీమిండియానే టైటిల్ ఫేవరేట్ అని అక్తర్ ఒప్పుకున్నారు. అయితే, న్యూజిలాండ్ జట్టు విజయం సాధించడం క్రికెట్‌కు మంచిదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ నిలకడగా రాణించే కివీస్, ఈసారి కూడా అద్భుతం చేసే అవకాశం ఉందని చెప్పారు. మరి అక్తర్ అంచనాలు నిజమవుతాయా? లేక భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడుతుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs New Zealand Final 2026 Shoaib Akhtar T20 World Cup Final Analysis T20 World Cup Final Pressure India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.