switzerland bar fire : స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మొంటానాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ‘లె కాన్‌స్టెల్లేషన్’ అనే బార్‌లో జరిగిన భారీ పేలుడు, అగ్నిప్రమాదంలో మరణాల సంఖ్య 47కి పెరిగిందని స్విస్ అధికారులు వెల్లడించారు.
దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ‘ఫ్లాషోవర్’ (Flashover) అనే ప్రమాదకర పరిస్థితి కారణంగానే పేలుడు, మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. పరిమిత స్థలంలో అధిక వేడి చేరి, అక్కడున్న అన్ని దహన పదార్థాలు ఒకేసారి మండిపోవడాన్నే ఫ్లాషోవర్‌గా పిలుస్తారు.
వాలైస్ కాంటన్ అటార్నీ జనరల్ బియాట్రిస్ పిలౌడ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పలు కోణాల్లో విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, ఘటన స్థలంలో లభించిన మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇదే ప్రధాన అనుమానంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం
అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ (switzerland bar fire) అసోసియేషన్ ప్రకారం, ఫ్లాషోవర్ సమయంలో గది మొత్తం మంటల్లో చిక్కుకున్నట్లుగా మారిపోతుంది. వస్తువులు మండటం కాదు, మొత్తం గదే అగ్నిప్రమాదంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటన ఉగ్రదాడి కాదని స్విస్ అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు, రెస్క్యూ హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వివరాలను ఇంకా వెల్లడించలేదని తెలిపారు. ఫోరెన్సిక్ బృందాల నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: