📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2

Telugu News: Trump Tariffs: Latest సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ ట్రంప్(Trump) అన్ని దేశాల మీదా సుంకాలతో విరుచుకుపడుతున్నారు. తన మాట వినకపోయినా కూడా సుంకాలతో దాడి చేస్తున్నారు. ప్రతీ దాని మీదనా టారీఫ్ లు విధిస్తూ చాలా దేశాలకు తలనొప్పిగా మారారు. ఇండియా, చైనాలాంటి దేశాల మీద అయితే అదనపు సుంకాలతో వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉన్నారు. సొంత దేశంలోనే ఇది అన్యాయమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సుంకాల కారణంగా అమెరికా ఆర్థికంగా పతనం అవుతున్నా వాటి విషయంలో మాత్రం తగ్గడం లేదు. దీంతో టారిఫ్ లను వ్యతిరేకిస్తూ కొంత మంది న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అధ్యక్షుడు ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Read Also: Trump Gold Card : ట్రంప్ షాకింగ్ ప్లాన్ $1 మిలియన్ ‘గోల్డ్ కార్డ్’తో US పౌరసత్వం?

Donald Trump

సుంకాల పై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ

ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో సుంకాల పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికా భద్రతకే పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. సుంకాల వలన వందల బిలియన్ డాలర్లు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో వీటి వల్ల మరిన్ని అద్భుతాలను చూస్తారని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు టారిఫ్ లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అమెరికాకు ఆర్థిక రక్షణ లేకుండా పోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

భారత్ కు హెచ్చరికలు జారీ

మరోవైపు మళ్ళీ సుంకాల పేరుతో భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇండియా తమకు మిత్ర దేశమని అంటారు. ప్రధాని మోదీ(PM Modi) తనకు మంచి స్నేహితుడని చెబుతూనే .. ట్రంప్ మాత్రం భారత్ పై కొత్త కొత్త సుంకాలను(trump tariffs) విధిస్తున్నారు. ఒకవైపు భారత్ వాణిజ్య చర్చలు సాగిస్తూనే మరోవైపు సుంకాలను బాదేస్తున్నారు. తాజాగా భారత బియ్యంపై సుంకాలను విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచంలోనే నంబర్ వన్ బియ్యం ఎగుమతిదారుగా, డజన్ల కొద్దీ దేశాలకు భారతీయ బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

2024 Elections american politics Breaking News in Telugu Court Ruling Donald Trump Google News in Telugu Latest In telugu news Political Controversy Telugu News Today US Democracy US Supreme Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.