📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sunrisers: అబ్రార్ అహ్మద్ కొనుగోలుపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sunrisers: ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ (The Hundred 2026) క్రికెట్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్ (Sun TV నెట్‌వర్క్) కొనుగోలు చేయడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. గతంలో వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని ఏకంగా రూ.2.34 కోట్లు పెట్టి కొనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.

Read Also: IPL 2026: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

Sunrisers: This is the BCCI’s reaction to the purchase of Abrar Ahmed!

రాజీవ్ శుక్లా ఏమన్నారంటే?

ఇది తమ పరిధిలోని అంశం కాదని, విదేశీ లీగ్‌కు సంబంధించిన విషయం కాబట్టి ఫ్రాంచైజీయే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “మేం ఇందులో ఏమీ చేయలేం” అని ఆయన స్ప‌ష్టం చేశారు.

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2008 నుంచి ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు ఆడటం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం విధిస్తాయని ప్రచారం జరిగింది. అయితే, దానికి భిన్నంగా ఈ కొనుగోలు జరగడం గమనార్హం. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కొనుగోలు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.