📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Sinusitis : సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు..

Author Icon By Sudha
Updated: November 7, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు లేదా చ‌ల్ల‌ని ఆహారాల‌ను తీసుకున్న‌ప్పుడు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి తీవ్ర ఇబ్బందులు క‌లుగుతాయి. సైన‌స్ ఉంటే విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంది. దీని వ‌ల్ల తీవ్ర‌మైన అవ‌స్థ‌లను ఎదుర్కొంటారు. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారు స‌హ‌జంగానే వైద్యులు ఇచ్చే మందుల‌ను వాడుతారు. యాంటీ బ‌యాటిక్స్‌తోపాటు నొప్పిని, క‌ఫాన్ని త‌గ్గించే మందుల‌ను వాడుతారు. సైన‌స్ (Sinusitis) స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. డ‌స్ట్ అల‌ర్జీ, ర‌సాయ‌నాలు లేదా ఇత‌ర ప‌దార్థాల వ‌ల్ల సైన‌స్ వ‌స్తుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు లేదా చ‌ల్ల‌ని ద్ర‌వాల‌ను తాగిన‌ప్పుడు కూడా సైన‌స్‌ (Sinusitis)ను ఎదుర్కొంటారు. ఈ క్ర‌మంలో నాసికా మార్గాలు, శ్వాస నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంది. గొంతులో, త‌లలో నొప్పి, ముఖం నొప్పి, ముక్కు, చెవులు, దంతాల్లో నొప్పిగా ఉండ‌డం, జ్వ‌రం, ముఖం వాపుల‌కు గుర‌వ‌డం, ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే సైన‌స్ ఉన్న‌వారు డాక్ట‌ర్ల ఇచ్చే మందుల‌ను వాడ‌డంతోపాటు ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది.

Read Also: Health: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే..

Sinusitis

విట‌మిన్ ఎ తో ఉప‌శ‌మనం

సైన‌స్ ఉన్న‌వారు చ‌ల్ల‌ని ద్ర‌వాల‌ను తాగ‌కూడ‌దు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో ఉన్న‌ప్పుడు ముక్కు, చెవులు, త‌ల భాగాల‌ను క‌వ‌ర్ చేసేలా క్యాప్‌ల‌ను ధ‌రించాలి. వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్‌, జంక్ ఫుడ్ తిన‌కూడదు. విట‌మిన్ ఎ అధికంగా ఉండే ఆహారాల‌ను తింటుంటే ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. విట‌మిన్ ఎ ఎక్కువ‌గా క్యారెట్లు, యాపిల్స్‌, ట‌మాటా, బ్రోక‌లీ, పాలు, నారింజ‌, అవ‌కాడో, ప‌నీర్ వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. వీటిని తిన‌డం వ‌ల్ల సైన‌స్ ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. అలాగే సైన‌స్ ఉన్న‌వారు ద్ర‌వాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. శ‌రీరంలో ద్ర‌వాల‌ను స‌మ‌తుల్యంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. త‌లనొప్పి, సైన‌స్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఇక సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారు పుదీనా ఆకుల నీళ్ల‌ను ఆవిరి ప‌డుతుంటే ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఒక పాత్ర‌లో బాగా మ‌రుగుతున్న నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకుల‌ను వేయాలి. అనంత‌రం దాని నుంచి వ‌చ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే ఫ‌లితం ఉంటుంది.

యోగా

సైన‌స్ ఉన్న‌వారు వేడి వేడి సూప్‌ల‌ను త‌ర‌చూ తాగుతుండాలి. నాన్ వెజ్ తినేవారు అయితే చికెన్ సూప్ తాగాలి. వెజిటేరియ‌న్లు వెజిట‌బుల్ సూప్‌ను తాగాలి. దీని వ‌ల్ల క‌ఫం క‌రిగిపోతుంది. ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. శ్వాస స‌రిగ్గా పీల్చుకుంటారు. ఇక సైన‌స్ ఉన్న‌వారు జ‌ల‌నేతి అనే ప్ర‌క్రియ‌ను అనుస‌రించాలి. దీని వ‌ల్ల సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జలనేతి అనేది ఒక యోగా ప్రక్రియ. ఇందులో భాగంగా అర లీటరు నీటికి ఒక టీస్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ బాగా కలిపి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం (జల నేతి పోట్) ను ఉపయోగించి ముక్కులోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే ముక్కు మరొక రంధ్రం ద్వారా ఆనీరు బయటకు వచ్చేస్తుంది. దీంతో ముక్కులో ఉండే మలినాలన్నీ బయటకు వస్తాయి. శ్వాస ఇబ్బందులు తొల‌గిపోతాయి. సైన‌స్ నుంచి ఉపశ‌మనం పొందుతారు. ముక్కు రెండు రంధ్రాలనూ ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి. సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు, ముక్కు దిబ్బడ లేదా ఆస్త‌మాతో బాధ పడుతున్నప్పుడు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఉపశమనం కోసం ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు వ‌ద్ద‌ సలహాలు, సూచనలను తీసుకోవాలి.

Sinusitis

అల్లంతో కాషాయం

ఇక సైన‌స్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా ఎంత‌గానో ప‌నిచేస్తుంది. ఇది మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. సైన‌స్ నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లిపి తాగాలి. ఇలా రోజుకు ఒక‌సారి తాగుతుండాలి. దీని వల్ల సైన‌స్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అల్లంతో త‌యారు చేసిన క‌షాయాన్ని రోజుకు 2 సార్లు తాగుతున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. లేదా ఒక టీస్పూన్ అల్లం ర‌సం, ఒక టీస్పూన్ తేనెను క‌లిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఇది సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంది. అలాగే కారం, మ‌సాలాలు ఉన్న ఆహారాల‌ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. వారంలో క‌నీసం 2 సార్లు ఇలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల క‌ఫం అంతా క‌రిగిపోతుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా ఆయా చిట్కాల‌ను పాటిస్తుంటే ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది.

సైనసైటిస్ అంటే ఏమిటి?

సైనసైటిస్ అంటే ముక్కు దగ్గర, కళ్ళ చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లలో వాపు రావడం. దీనివల్ల ముఖంలో నొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా జలుబు, ఫ్లూ లేదా అలెర్జీల వల్ల వస్తుంది.  

సైనసిటిస్ చెవిని ప్రభావితం చేస్తుందా?

సైనసైటిస్ మరియు చెవి నొప్పి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి ఎందుకంటే సైనస్ రద్దీ తరచుగా చెవి రద్దీగా మారుతుంది . సోకిన సైనస్‌లు ఉబ్బి శ్లేష్మంతో నిండిపోతాయి, తద్వారా మధ్య చెవి వంటి సమీప శరీర భాగాలపై బాధాకరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దీని వలన ఒకటి లేదా రెండు చెవులలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News health-tips home-remedies latest news sinus-problems sinus-relief sinusitis Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.