📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Latest Telugu News : Siddaramaiah : సిద్ధరామయ్య సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ..

Author Icon By Sudha
Updated: November 6, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య (Siddaramaiah) సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్‌ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వాడ్‌ సింగిల్‌ జడ్జి బెంచ్‌ స్టే ఇచ్చింది. సింగిల్‌ జడ్జి నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్‌ చేసింది. స్టే విషయంలో అదే బెంచ్‌కు వెళ్లాలని న్యాయమూర్తులు ఎస్‌జీ పండిట్‌, గీతా కేబీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వానికి సూచించింది. అయితే, సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. నిర్వహించే ముందు ప్రైవేటు సంస్థలు పరిపాలనా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా కార్యక్రమం, ఊరేగింపు భారత జాతీయ చట్టం నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉత్తర్వుల్లోని నిబంధనలు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు, మార్చ్‌లపై ప్రభావం చూపే ఉద్దేశంతో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ ఉత్తర్వులను పునస్చైతన్య సేవా సమస్త అనే సంస్థ ధార్వాడ్‌ హైకోర్టు బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ బెంచ్‌ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చింది. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా.. ప్రజలంతా కలిసి కవాతు చేయాలనుకుంటే.. దాన్ని ఆపొచ్చా? అంటూ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై దిసభ్య ధర్మాసనం అప్పీల్‌ దాఖలు చేసేందుకు సింగిల్‌ జడ్జి న్యాయమూర్తిని ఆశ్రయించాలని సూచించింది.

Read Also : http://Vijay Kumar Sinha : ఎన్నికల వేళ బీహార్‌ ఉపముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

Siddaramaiah

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉత్తర్వు ర్యాలీలు, ఊరేగింపులు వంటి వ్యవస్థీకృత కార్యక్రమాలకు వర్తిస్తుందని, అనధికారిక సమావేశాలకు కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిరసనలను ఫ్రీడమ్ పార్క్‌కు, క్రీడా కార్యక్రమాలను కంఠీరవ స్టేడియానికి పరిమితం చేసిందని పేర్కొన్నారు. పునశ్చేతన సేవా సంస్థ, వీ కేర్ ఫౌండేషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అశోక్ హర్నహళ్లి వాదనలు వినిపిస్తూ.. క్రికెట్ ఆడే జట్టు సైతం ప్రతిరోజూ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్ని సింగిల్‌ ధర్మాసనం ప్రభుత్వం అప్పీల్‌ను తోసిపుచ్చింది. ఈ అంశంపై మరోసారి ఈ నెల 17న ధార్వాడ్‌ బెంచ్‌ విచారణ జరుపనున్నది.

సిద్దరామయ్య రాజకీయ జీవితం ?

సిద్దరామయ్య, (జననం: 3 ఆగష్టు 1947) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతని ముద్దుపేరు సిద్దూ. ఆపేరుతో కూడా పిలుస్తారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినరాజకీయ నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా 2023 మే 20 నుండి అధికారంలో కొనసాగుచున్నారు. అతను గతంలో 2013 మే 13 నుండి 2018 మే 16 వరకు మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసారు. పూర్తి ఐదేళ్ల కాలానికి ఆ పదవిని నిర్వహించిన రెండవ వ్యక్తి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Congress government High court Karnataka politics latest news legal setback Siddaramaiah Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.