Latest news: Schedule Cast: రోస్టర్ విధానాన్ని సరిచేసి మాలలకు న్యాయం చేయాలి: చెన్నయ్య

Read Time:  1 min
Schedule Cast
Schedule Cast
FONT SIZE
GET APP

అంబేద్కర్ విగ్రహాం ఎదుట ప్రదర్శన నిర్వహిస్తున్న మాల నాయకులు

హైదరాబాద్ (సైఫాబాద్) : దేశ పౌరులందరికి రాజ్యాంగం, స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించిన గొప్ప మేధావి డా.బి.ఆర్.అంబేద్కర్(Dr. B.R. Ambedkar) అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్తు కొనియాడారు. (Schedule Cast) రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ట్యాంక్బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భంగా వారు మాట్లాడారు.

చంద్రబాబు తీరు మారకుంటే రైతులతో కలిసి ఉద్యమం

Schedule Cast
Mala leaders holding a demonstration in front of Ambedkar’s statue

ఎస్సీ వర్గీకరణ, రోస్టర్‌లో మాలలకు అన్యాయం:నాయకుల నిరసన

ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో మాలలకు(Schedule Cast) ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ బద్దమైన హక్కులను ప్రభుత్వం కాలరాస్తూ విద్యా, ఉద్యోగ అవకాశాలను మాలలకు దక్కనీయకుండా చేసిందని వారు విమర్శించారు. కుట్రపూరితంగా తయారు చేసిన రోస్టర్ పాయింట్ల కేటాయింపును సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇచ్చిన భిక్షతో ఎన్నికైన మాల ప్రజాప్ర తినిధులు అట్టడుగున ఉన్న మాలల కోసం గోంతు విప్పాలని, మాలల పట్ల నిరంకుశంగా వ్యవహ రిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు రమేష్, బైండ్ల శ్రీనివాస్, ఎం. సరళ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.