పెద్ద శంకరంపేట (మెదక్) మండల పరిధిలోని రామోజీ పల్లి లో జయశీల దంపతులకు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి(Sanjeeva Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు.
Read Also: Telangana: మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి(Sanjeeva Reddy) మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవరూపం దా లుస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లు మంజూరయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు జరుగుతుండగా మరికొన్ని వివిధనిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధ్యమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాకిర్ అలీ, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్, నారా గౌడ్, రాజు, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: