రాజస్థాన్ (Rajasthan) లోని జైపూర్–ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాలను విషాదంలో ముంచింది. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. ఆనందంగా గడిపిన వేడుక, క్షణాల్లోనే శోకంగా మారిపోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
Read Also: New Guidelines: వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
మంచి మిత్రులు
పెళ్లికి హాజరై తిరిగి కారులో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులు సమయ్ (25), లోకేశ్ (24), దిల్‌కుష్ (24), మనీశ్ (23), అంకిత్ (26), నవీన్ (23)గా గుర్తించారు. వారంతా మంచి మిత్రులంటూ కలాఖో గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: