హైదరాబాద్ (జూబ్లీహిల్స్) : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Prabhakar) స్పష్టం చేశారు. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ నెల 1 నుంచి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రత్యేక సీఎస్ వికాసీజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్త్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జేటీసీ, డీటీసీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణతోపాటు వాహనాల స్టిక్కర్స్, విద్యార్థుల ఆవాహన పుస్తకాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
Read also: Telangana Politics:పాలమూరు–రంగారెడ్డి అంశంపై రాజకీయ రచ్చ
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రి ప్రభాకర్
తాజాగా తెలంగాణ (TG) రాష్ట్రంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నట్లు రాష్ట్ర డీజీపీ సైతం మీడియా సమావేశంలో స్పష్టం (Prabhakar) చేశారన్నారు. ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్పాట్ తొలగిస్తూనే దానిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులను, అధికారులను భాగస్వామ్యం చేస్తూ నెల రోజులపాటు ప్రణాళిక సిద్ధం దేశామన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామి తల్లిదండ్రుల నుంచి ప్రతి విద్యార్థి హామిపత్రం తీసుకోవాలన్నారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎక్కువగా మరణాలు సంభవించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా వేస్తున్నా కేసులు నమోదు తగ్గడం లేదన్నారు. ప్రతి విద్యార్థి దగ్గరకు రవాణా శాఖ చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిఖ్వ చేయించాలని సూచించారు. ప్రాణాలను కాపాడే ఈ క్రతువులో యంత్రాంగం భాగస్వామ్యం ఉంటుందన్నారు. రాష్ట్రంలో వేయి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే 1.80 కోట్ల వాహనాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని వారి విషయంలో కరనంగా వ్యవహరిస్తున్నామన్నారు. యూనిఫెస్ సూచనలతో పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెన్ పాక్స్లు ఏర్పాటు చేస్తున్నామన్నాడు. రవాణా శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ట్రాఫిక్ అవేర్నెస్ పార్ట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రమాదరహిత డ్రైవర్ల కుటుంబాలకు భరోసా
రోడ్డు భద్రత మాసోత్సవంపై మీడియా సైతం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు ఆర్టీసీ సంస్థ మూసేస్తామనే పరిస్థితి నుండి అన్ని డిపోలకు లాభాల్లోకి వస్తున్నాయని ప్రసంగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు గురువారం నాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో జరిగాయి. ఈ సందర్బంగా ప్రమాదరహిత డ్రైవర్లకు మంత్రి పురస్కారాలను ప్రదానం చేసి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు, శాశ్వత దివ్యాంగులయిన కుటుంబాలు దుర్భరంగా ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెహికిల్ ఫిట్వెస్ ఉండాల్సిందే.. ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్డెక్కించాలన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, నగర ట్రాఫిక్ అదనపు కమీషనర్ జోయెల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com