PCC President: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని ప్రతిపాదించారు. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల కోసం పోరాడే నిజమైన మాస్ లీడర్ అని ఆయన కొనియాడారు.
Read Also: Telangana Budget: మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్

జగ్గారెడ్డి మరో పీజీఆర్.. ఆయన అధ్యక్షుడైతే కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా!
జగ్గారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని, ఆయన అధ్యక్షుడైతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో దివంగత నేత పీజీఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) ప్రజల కోసం ఎలా పోరాడేవారో, జగ్గారెడ్డి కూడా అదే తరహాలో ఉంటారని ఆయనను మరో పీజీఆర్‌తో పోల్చారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జగ్గారెడ్డి ఎప్పుడూ ముందుంటారని కితాబిచ్చారు.
కేవలం అసెంబ్లీలోనే కాకుండా, ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఒక బహిరంగ వేదికపై కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. జగ్గారెడ్డిది మానవత్వం ఉన్న వ్యక్తిత్వమని, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ మంత్రులు జగ్గారెడ్డికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: