📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nara Lokesh: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం

Author Icon By Saritha
Updated: January 28, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియా (Social media) వాడుతున్నారు. దీని వల్ల సోషల్ మీడియాకు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. దీన్ని నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాపై బ్యాన్ విధించనుంది.

పదహారేళ్ల వయసు లోపు ఉన్న వారు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త చట్టం తీసుకురానుంది. ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ కమిటీలో హోం మంత్రి వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ వంటి కీలక నేతలు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలులో ఉన్న సోషల్ మీడియా నిబంధనలను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ఆస్ట్రేలియా దేశం ఇటీవల 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఏపీలోనూ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

Read Also: TTD: శ్రీవారికి కాసుల వర్షం.. తిరుమలలో పెరిగిన రద్దీ!

A decision on banning social media in Andhra Pradesh will be made soon.

నిషేధం ఎందుకు?

సోషల్ మీడియాకు దూరంగా ఉంటే పిల్లల్లో అటెన్షన్ స్పాన్ (ఏకాగ్రత) పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వర్చువల్ ప్రపంచంలో కాకుండా, తోటి పిల్లలతో ప్రత్యక్షంగా ఆడుకోవడం, మాట్లాడుకోవడం వల్ల వారి మానసిక వికాసం బాగుంటుంది. ఆన్‌లైన్ వేధింపులు, వ్యసనంగా మారే అల్గారిథమ్‌ల నుండి మైనర్లను రక్షించడం ఈ సోషల్ మీడియా బ్యాన్ (social media ban) ప్రధాన ఉద్దేశం. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం (Nara Lokesh) మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల సర్క్యులేషన్‌ను అడ్డుకోవడానికి ‘స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేషన్ సెల్’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సోషల్ మీడియా బ్యాన్‌ను వయసు ఆధారంగా అకౌంట్లు గుర్తించి అమలు చేస్తారా? లేక కొత్త విధానాన్ని తీసుకొస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.