Mumbai-Pune Expressway: ముంబయి-పుణె ఎక్స్ ప్రెస్‌వేపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (MSRDC) ఊరట కల్పించింది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న సుమారు 1.2 లక్షల వాహనాలకు వసూలు చేసిన టోల్ రుసుము రూ.5.16 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని రానున్న వారంలోగా నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ (FASTag) ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నెల 3న ఖోపోలి సమీపంలో ప్రొపిలీన్ గ్యాస్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ ప్రమాదం సంభవించింది. భద్రతా కారణ దృష్ట్యా పుణె నుంచి ముంబయి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. దీనివల్ల దాదాపు 32 గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. గ్యాస్ లీకేజీ ప్రమాదం పొంచి ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనల మధ్య రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది.
Read Also: Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ప్రమాదం జరిగిన వెంటనే టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల అనేక వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్‌గా కట్ అయింది. గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న తమపై టోల్ భారం పడటంపై వాహనదారులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రభుత్వం, టోల్ ఆపరేటర్ ఐఆర్‌బీ (IRB) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి డేటాను సేకరించి బాధితులను గుర్తించింది.
నేరుగా ఖాతాల్లోకి నగదు జమ
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ఆ సమయంలో ప్రభావితమైన పుణె-బెంగళూరు హైవేపై వసూలు చేసిన టోల్‌ను కూడా రీఫండ్ చేయాలని నిర్ణయించారు. ఎటువంటి దరఖాస్తులు అవసరం లేకుండానే, గుర్తించిన వాహనదారుల ఫాస్టాగ్ వ్యాలెట్‌లకు ఈ డబ్బు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: