ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ
హైదరాబాద్ : మేడారం జాతరలో (Medaram Jatara) భాగంగా వీణవంక గ్రామంలో గురువారం నాడు పోలీసులతో జరిగిన గొడవ వివాదం కావడంతో MLA కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) పోలీసులకు క్షమాపణలు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఆయన ఈ మేరకు ఎక్స్ పోస్టు పెట్టడంతో పాటు వీడియో విడుదల చేశారు. తాను ఎవరి మనోభావాలను కించరచిచే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని ఆయన తెలిపారు.
దళిత మహిళ సర్పంచును కొబ్బరికాయ కొట్టేందుకు అనుమతించలేదని, దీనిని తాను తప్పుపట్టానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు పోలీసులకు మధ్య గొడవ జ రిగిందని, ఈ సమయంలో తాను పొరపాటున నోరు జారానని, ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలను దెబ్బ తీసివుంటే క్షమించాలని ఆయన కోరారు. పోలీసు అధికారులంటే తనకు గౌరవం వుందని ఆయన తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు తన కుటుం బంపై కక్ష సాధిస్తున్నారని ఆయన తెలిపారు.
Read Also: TG: రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
ఘటనపై చర్యలు తీసుకోవాలన్న పోలీసు సంఘాల డిమాండ్
మేడారం జాతరలో (Medaram Jatara) గురువారం నాడు వీణవంక వద్ద పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన హుజూరాబాద్ ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ఆలయంతో పాటు మరికొందరు అధికారులు మేడారం జాతరలో మతమార్పిడికి పాల్పడుతున్నట్లు, మతపరంగా వ్యవహరిస్తున్నట్లు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని సంఘం కార్యదర్శి విక్రంసింగ్ మాన్ తప్పుపట్టారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మేడారం జాతరలో బందో బస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులతో ఎంఎల్ఎగా వున్న కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించడంతో పాటు మతపరమైన వ్యాఖ్యలను వారికి ఆపాదించడం క్షమార్హం కాదని ఆయన తెలిపారు. మహిళా పోలీసులతోనూ ఆయన అనుచితంగా ప్రవర్తించారని విక్రం సింగ్ మాన్ తెలి పారు. ఇందుకుగానూ కౌశిక్ రెడ్డి వెంటనే పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన, ఆడ్డ గోలు వ్యవహారశైలిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పోలీసు అధికారుల సంఘం ఖండన
కాగా, పోలీసులతో మేడారం జాతరలో ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించడంపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ
మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పోలీసులకు మతాన్ని ఆపాదించడం సరైంది కా దని తెలిపారు. పోలీసుల విధి నిర్వహణ చట్టానికి లోబడి వుంటుందని, మతం ఆధారంగా వుండదని ఆయన తెలిపారు. మేడారం జాతరలో ఒక చోట కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలం లేకున్నా ఆయనపై కౌశిక్ రెడ్డి అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని గోపిరెడ్డి ఖండించారు. ఈ విషయం లో కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వీణవంకలో ఏం జరిగిందంటే..?
కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారాలమ్మ జాతరలో దళిత సర్పంచును కొబ్బరికాయ కొట్టనివ్వ లేదని కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో క లిసి గురువారం రాత్రి నిరసన తెలిపారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వుండడంతో నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా కౌశిక్ రెడ్డి పోలీసులను దిక్కరించి నిరసన చేయడంతో వివాదం రాజుకుంది. దీంతో. పోలీసులు బలవంతంగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన భార్య, కూతురును పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించడంతో పాటు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసినందుకు వీణవంక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: