ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా కల త్వరలోనే నిజం కానుంది. ఈ జిల్లా ఏర్పాటు అంశం చాలా కాలంగా ప్రజల ఆశగా మారగా, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పుడు సాకార దిశలో పయనిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ జిల్లాను ప్రతిపాదిస్తూ కీలక సూచనలు చేసింది. దీంతో మార్కాపురం ఆధారంగా కొత్త జిల్లా నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.
Breaking News – Chiranjeevi : చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు భాగం కానున్నాయి. ఈ ప్రాంతాలు భౌగోళికంగా సమీపంలో ఉండటమే కాకుండా సామాజిక, ఆర్థిక పరంగా కూడా అనుసంధానమై ఉండటంతో, ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు మరింత అందుబాటులోకి రావడం ఖాయం. మార్కాపురం జిల్లాగా ఏర్పడితే ప్రజలకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరుతాయి, ప్రజా సేవలు పారదర్శకంగా అమలు కావడానికి వీలు కలుగుతుంది. అంతేకాక, ఈ ప్రాంత అభివృద్ధి గణనీయ స్థాయిలో పెరుగుతుందని స్థానిక నాయకులు విశ్వసిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో చేర్చడంపై కూడా చర్చ జరుగుతోంది. వచ్చే నవంబర్ 7న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుదిర్ణయం తీసుకునే అవకాశముంది. పునర్విభజన తర్వాత ఏర్పడే రెండు జిల్లాలు ప్రజల సౌకర్యం, పరిపాలనా సమర్థతకు దోహదపడే విధంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. పశ్చిమ ప్రకాశం ప్రజల ఏళ్ల కోరిక నిజమవుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పరిపాలనా విభజన మాత్రమే కాదు, కొత్త అభివృద్ధి దశకు శ్రీకారం చుడే ప్రారంభం అనే భావనతో స్థానికులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/