ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చడంతో హోటల్ రంగం ఊహించని సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తమ రోజువారీ వంట అవసరాల కోసం భారీ ఎత్తున కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడతాయి. అయితే, గత కొద్దిరోజులుగా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం, బుక్ చేసినా సకాలంలో స్టాక్ రాకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గ్యాస్ లేక వంటలు నిలిచిపోయి వ్యాపారం దెబ్బతినడంతో, గత్యంతరం లేక ఇప్పటికే పలు చిన్న మధ్యతరహా హోటళ్లు మూతపడ్డాయి. ఈ అనిశ్చితి వల్ల గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మేలని హోటల్ నిర్వాహకులు భావిస్తున్నారు.
Read Also ; AP Assembly : అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్
ఈ గ్యాస్ సంక్షోభం కారణంగా పాతకాలపు కట్టెల పొయ్యిలకు మళ్ళీ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లోని హోటళ్లలో ఇప్పుడు కట్టెల పొయ్యిలే దర్శనమిస్తున్నాయి. చెన్నైలో ఒక హోటల్ యజమాని ఏకంగా ప్రత్యేకంగా బట్టీని కట్టించుకుని, టన్నుల కొద్దీ కట్టెలను తెప్పించుకుని వంటలు ప్రారంభిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హైదరాబాద్‌లో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ ధరలు పెరగడం ఒక ఎత్తయితే, అసలు దొరకకపోవడం మరో ఎత్తుగా మారిందని, కట్టెల పొయ్యి వల్ల ఖర్చు కొంచెం తగ్గినా.. పని భారం మరియు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే మున్ముందు హోటల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :