Latest news: Lottery: లాటరీతో రూ.11 కోట్లు గెలుచుకున్న కూరగాయల వ్యాపారి

Read Time:  1 min
Lottery
Lottery
FONT SIZE
GET APP

ఐశ్వర్యం ఒక అడుగు వస్తే, దారిద్య్రం పది అడుగుల వేగంతో దూసుకొస్తుంది. అలాగని అందరి జీవితాలలో ఇదే జరగదు. కొన్నిసార్లు ఇది రివర్స్ అవుతుంది. జీవితంలో ఒక్కసారైనా జాక్ పాట్ కొట్టాలని ఎవరికి ఉండదు. అలాగని అదృష్టాన్నే నమ్ముకుని జీవించడం కంటే, కష్టపడి పనిచేస్తూ వాస్తవంలో జీవించడం శ్రేష్టమైనది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా..? ఓ కూరగాయల వ్యాపారిని అదృష్టం(Lottery) వరించింది. ఎంతలా అంటే అతని ఊహలకు కూడా అందనంతగా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: ఎంపీ జోగు రామన్న ముట్టడితో ఉద్రిక్తత

Lottery
Lottery: లాటరీతో రూ.11 కోట్లు గెలుచుకున్న కూరగాయల వ్యాపారి

రూ.500 లాటరీలో రూ.11 కోట్లు వచ్చాయి

ఓ కూరగాయల వ్యాపారికి లాటరీ(Lottery) తగిలింది. స్నేహితుడు కొనిచ్చిన రూ.500 టికెట్ తో ఏకంగా రూ.11 కోట్లు గెలుచుకున్నాడు. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ నెహ్రా, పంజాబ్ రాష్ట్ర లాటరీ దీపావళి(Diwali) బంబర్ 2025లో రూ.11 కోట్ల బహుమతిని గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక ఆయన స్నేహితుడి సాయం ఉంది. స్నేహితుడి వద్ద రూ.500 అప్పుగా తీసుకుని

కొనుగోలు చేసిన టికెట్ తోనే ఆయన జీవితం రాత్రికిరాత్రే కోటిశ్వరుడిగా మార్చింది. విజేత నంబర్లు ప్రకటించిన కొద్దిరోజుల తర్వాత తన క్లెయిమ్ ను అధికారికం చేయడానికి సెహ్రా మంగళవారం చండీగఢ్ కు వచ్చాడు.

లాటరీ కొనడం ఇదే మొదటిసారి

లాటరీ టికెట్ కొనడం సెహ్రా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో తన స్నేహితుడు ముకేశ్ రూ.500 అప్పుగా ఇవ్వడంతోనే ఆ టికెట్ కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో అతనికి రూ.11కోట్ల లాటరీ తగిలింది. తన స్నేహితుడు ముకేశ్ కు కృతజ్ఞతగా రూ. 1లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ముకేశ్ కు ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.50,000 అందజేస్తానని తెలిపాడు. అక్టోబరు 31వ తేదీన పంజాబు ప్రభుత్వం విజేతను ప్రకటించినప్పటికీ సెహ్రాకు తన అదృష్టాన్ని నమ్మడానికి సమయం పట్టింది. మొబైల్ ఫోన్ ఉపయోగించని నెహ్రా మొదట తన లాటరీ విజయం గురించి వచ్చిన వార్తలను అబద్దాలుగా కొట్టిపారేశాడు. చివరికి లాటరీవారే తమ ఇంటికి వచ్చి బహుమతిని క్లెయిమ్ చేసుకునే విధానాన్ని వివరించినట్లు నెహ్రా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.