Lisa Gill: ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా విశేష సేవలు అందించిన ఆమె, ఇప్పుడు ఏపీ హైకోర్టు నాయకత్వం వహించబోతున్నారు. సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Payakaraopeta Crime: బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: