📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Rain: హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్​(Hyderabad) నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉష్టోగ్రతలు తగ్గిపోయాయి. ఖైరతాబాద్​తో పాటు పలుచోట్ల వర్షం కురుస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరో ద్రోణి : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాత్వాడ వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరొక ద్రోణి ఈరోజు ఏర్పడినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

LocalBody elections: ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

Telangana: Light rain in many places in Hyderabad

ఉరుములు, మెరుపులతో వర్షం : ఆదివారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం నుంచి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Drizzles in city areas Hyderabad weather update IMD forecast Hyderabad Light rain in Hyderabad Sudden rainfall Telangana Telangana weather news Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.