📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Khammam: QR కోడ్‌ల ద్వారా మోసాలు: షాప్ యజమానులకు హెచ్చరిక.

Author Icon By Sushmitha
Updated: October 25, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొత్త తరహా సైబర్(Cyber) మోసం వెలుగులోకి వచ్చింది. ఒక సూపర్‌మార్కెట్ యజమానికి క్యూఆర్ కోడ్ స్కానర్(QR Code)(scanner) ద్వారా వచ్చే డబ్బులు తన ఖాతాలోకి రావడం లేదని అనుమానం కలగడంతో, సీసీ కెమెరా ఫుటేజీని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.

Read Also: Sachin Sanghvi: బాలీవుడ్ సింగర్‌పై మహిళా గాయని ఫిర్యాదు

మోసగాడి కొత్త ట్రిక్

మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) కూడా తమ మోసపు ట్రిక్స్‌ను అప్‌డేట్ చేసుకుంటున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్న ఓ సూపర్‌మార్కెట్‌ నడుపుతున్నారు. కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేయడానికి షాపు ముందు క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 7న గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి వెంకన్న అకౌంట్‌కు సంబంధించిన అసలైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను తీసేసి, తను తీసుకొచ్చిన నకిలీ క్యూఆర్ కోడ్‌ను అంటించి వెళ్లిపోయాడు.

యజమాని ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తు

అప్పటి నుంచి షాపులో కొనుగోలు చేసిన కస్టమర్లు స్కాన్ చేసినప్పటికీ, మొత్తం నగదు ఆ దొంగల ఖాతాకే మళ్లింది. అనుమానం వచ్చిన వెంకన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించగా, ఆ వ్యక్తి క్యూఆర్ స్టిక్కర్ మార్చి పెట్టిన విషయం స్పష్టంగా రికార్డైంది. తీరా డబ్బులు వెళ్తున్న ఖాతా ఒక మహిళ పేరుతో ఉందని గమనించిన వెంకన్న వెంటనే తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జగదీష్ హెచ్చరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు దాన్ని పరిశీలించుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవచ్చని ఆయన సూచించారు.

ఈ కొత్త తరహా సైబర్ మోసం ఎక్కడ జరిగింది?

ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, దమ్మాయిగూడెం గ్రామంలోని ఒక సూపర్‌మార్కెట్‌లో జరిగింది.

సైబర్ నేరగాడు ఎలా మోసం చేశాడు?

షాపు ముందు ఉన్న అసలైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను తీసేసి, తన నకిలీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను అతికించాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cyber Crime digital payment fraud Google News in Telugu Khammam Latest News in Telugu police investigation. QR code scam Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.