📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Karnataka Crime: భర్తను హత్య చేసి గుండెపోటుగా డ్రామా

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Karnataka Crime: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వెలుగుచూసిన ఒక హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పరమేష్ అనే వ్యక్తి హఠాత్తుగా మరణించగా, ఆయన భార్య ఆశ అది సహజ మరణమని, గుండెపోటుతోనే చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఏ విధమైన అనుమానం రాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అయితే, కాలం గడిచేకొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పులు రావడంతో అసలు నిజం బయటపడింది.

Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Karnataka Crime: Drama as husband dies after being murdered and heart attack

పరమేష్ చనిపోయిన కేవలం 20 రోజుల్లోనే ఆశ తన ప్రియుడు చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో మలుపు తిప్పింది. భర్త మరణించిన కొద్ది రోజులకే మరో పెళ్లి చేసుకోవడంపై పరమేష్ సోదరీమణులకు తీవ్ర అనుమానం కలిగింది. తన భర్త మరణం వెనుక ఏదో కుట్ర ఉందని భావించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు

పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతితో పూడ్చిపెట్టిన పరమేష్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య పరీక్షల నివేదికలో అది సహజ మరణం కాదని, ఊపిరాడక చనిపోయాడని తేలింది. పోలీసుల శైలిలో ఆశ మరియు చంద్రప్పను విచారించగా, వారిద్దరూ కలిసి పరమేష్‌ను దిండుతో ముఖంపై అదిమి పట్టి హత్య చేసినట్లు అంగీకరించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈ కిరాతక జంటను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Extramarital affair Husband Murder Karnataka crime Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.