రిజర్వేషన్లు సాధించేదాక బిసిలతో పోరాటంలో భాగస్వామ్యం: మంద కృష్ణమాదిగ
హైదరాబాద్ (సైఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం బీసీలను (B.C) ఊచకోత కోసిందని రాష్ట్ర బీసీ జాక్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని, పార్టీపరంగా ఇస్తామని ప్రకటించడం దారుణమని ఆయన విమర్శించారు.
Read Also: Minister Savita: డిసెంబర్14నుంచి BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, డిమాండ్లు
గురువారం జెఎసి కార్యాలయంలో ఎంఆర్‌పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడుతూ, ఈ నెల 17న పార్టీపరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) మాట ఇచ్చి పది రోజులు గడిచిందని, కానీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేసి చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (B.C Reservations) కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల పోరాటానికి ఎంఆర్‌పీఎస్ మద్దతు, భవిష్యత్ కార్యాచరణ
ఇందు కోసం ఈ నెల 30న ధర్నాచౌక్‌లో వేలాది మంది బీసీలతో రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహిస్తామని, డిసెంబరు 8, 9 తేదీల్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. మంద కృష్ణమాదిగ ఎలా వర్గీకరణను సాధించారో అదే స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధిస్తామని స్పష్టం చేశారు.
మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీలను దగా చేస్తున్నదని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేంతవరకు బీసీలు చేసే పోరాటంలో ఎంఆర్‌పీఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు గుజ్జ కృష్ణ, కులక్కచర్ల శ్రీనివాస్, శ్యాం, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: