📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Indian women: అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

Author Icon By Vanipushpa
Updated: January 8, 2026 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లో మన భారతీయులు చాలా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు, ఇంజినీర్లు, బిజినెస్‌మెన్‌లు, లాయర్లు, రాజకీయ రంగంలో రాణిస్తున్న వారు అనేకం ఉన్నారు. భారత్ నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడి ఉన్నవారు కొందరు అయితే.. వలసదారుల పిల్లలుగా ఉండి భారత మూలాలు ఉన్న వారు మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో మహిళ.. అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. న్యూజెర్సీ నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా డాక్టర్ టీనా షా నిలవనున్నారు. ఒక డాక్టర్‌గా.. వైద్య రంగాన్ని పీడిస్తున్న సమస్యలను పరిష్కరించాలని.. ముఖ్యంగా పేదల ఆరోగ్య పథకాలకు నిధులు తగ్గించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read Also: USA: భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

వైట్ హౌస్ ఫెలోగా పనిచేసిన అనుభవం

టీనా షా తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఆమె ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ట్రిపుల్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్. టీనా షా ఒక ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణురాలు. ప్రస్తుతం ఆమె RWJBarnabas Healthలో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ టీనా షా అమెరికాలోని మూడు ప్రభుత్వ యంత్రాంగాల్లో (ఒబామా, ట్రంప్, బైడెన్) పాలసీ రోల్స్ పోషించారు. యూఎస్ సర్జన్ జనరల్‌కు సీనియర్ సలహాదారుగా, వైట్ హౌస్ ఫెలోగా కూడా ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది. డాక్టర్ టీనా షా.. పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.. జెఫర్సన్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ.. చికాగో విశ్వవిద్యాలయంలో పల్మనరీ, క్రిటికల్ కేర్ ఫెలోషిప్‌ను పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.

రూ. 9 కోట్ల నిధులను సేకరించి రికార్డు

రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అంటే ఏడాది లోపే డాక్టర్ టీనా షా.. 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9 కోట్ల నిధులను సేకరించి రికార్డు సృష్టించారు. న్యూజెర్సీ 7వ డిస్ట్రిక్ట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ మైలురాయిని దాటిన మొట్ట మొదటి డెమోక్రాట్ డాక్టర్ టీనా షా కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , టామ్ కీన్ జూనియర్ ప్రతిపాదించిన మెడికేడ్ నిధుల కోతలను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని డాక్టర్ టీనా షా ప్రకటించారు. ఈ కోతలు బిలియనీర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చి.. సామాన్యుల వైద్య సదుపాయాలను దెబ్బతీస్తాయని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అ

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Democratic Party USA Dr. Tina Shah Indian American politician Indian origin candidates in America New Jersey 7th District Telugu News online Telugu News Today Tina Shah Congress race US Congress election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.