📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India vs Italy: ఇటలీపై భారత్ అద్భుత విజయం

Author Icon By Anusha
Updated: March 14, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India vs Italy: హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న FIH హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2026లో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో భారత్ 1-0 తేడాతో ఇటలీని ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు సగర్వంగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

Read Also: Sun TV Network-CSK: సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

హోరాహోరీగా సాగిన పోరు

మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. తొలి క్వార్టర్‌లో భారత్, ఇటలీ రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినా రక్షణ శ్రేణులు బలంగా నిలబడటంతో స్కోరు సమంగా ఉంది. రెండో క్వార్టర్‌లో భారత్ వరుస పెనాల్టీ కార్నర్‌లను సాధించి ఒత్తిడి పెంచినప్పటికీ, ఇటలీ గోల్‌కీపర్ లూసియా ఇనెస్ అద్భుతమైన ప్రదర్శనతో వాటిని అడ్డుకుంది.

India vs Italy: India’s stunning victory over Italy

ఆట 40వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మనీషా చౌహాన్ అద్భుతంగా గోల్‌గా మలిచింది. ఆమె కొట్టిన పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్ ఇటలీ డిఫెన్స్‌ను ఛేదించుకుని నేరుగా నెట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఏకైక గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో స్కోరు సమం చేసేందుకు ఇటలీ తీవ్రంగా ప్రయత్నించింది. 59వ నిమిషంలో వారికి పెనాల్టీ కార్నర్ లభించినా, భారత రక్షణ గోడను వారు ఛేదించలేకపోయారు. దీంతో భారత్ విజయం ఖాయమైంది.నేటి(14న) రాత్రి 7:30 గంటలకు జరిగే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

FIH Hockey World Cup Qualifiers 2026 Gachibowli Hockey Stadium Hockey Semifinal India vs Italy Indian Women's Hockey Team

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.