India vs England: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లెంది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో టీమిండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.
Read Also: Harry Brook: ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఏమన్నారంటే?
సంజూ శాంసన్ విధ్వంసం: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్ విజయంలో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సహాయంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ కనబరిచిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు గానూ ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: