హీరో రోషన్ (Roshan) తన కెరీర్ గురించి, వ్యక్తిగత లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు తాను క్రికెటర్ కావాలని కలలు కన్నానని, తన తండ్రి శ్రీకాంత్ కూడా అదే కోరుకున్నారని తెలిపారు. కానీ కాలేజీ రోజుల తర్వాత సినిమాలపై ఆసక్తి పెరిగి ఈ రంగంలోకి వచ్చానన్నారు. ‘ఛాంపియన్’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా, రెండు సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నానని,
Read Also: Shambhala Movie: ‘శంబాల’ ట్రైలర్ విడుదల

కొత్త రోషన్‌ను చూస్తారు
ఇప్పటికే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని రోషన్ స్పష్టం చేశారు. ‘ఛాంపియన్’ (Champion Movie) తో ప్రేక్షకులు ఓ కొత్త రోషన్‌ను చూస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.ఈ సినిమా అవకాశం గురించి రోషన్ (Roshan) మాట్లాడుతూ, “నిర్మాత దత్తు గారు ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అలాంటి నిర్మాత నాకు ఇంత గ్రాండ్‌గా ‘ఛాంపియన్’ సినిమా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్వప్న అక్క, ప్రియాంక అక్క, దత్తు గారు అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు” అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: