📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HPV Vaccine: HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Author Icon By Saritha
Updated: March 2, 2026 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

HPV Vaccine: భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు బాలికలకు ఉచితంగా అందిస్తున్న HPV (Human Papillomavirus) వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీవ్రంగా ఖండించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు ఉంటాయనే వార్తల్లో నిజం లేదని, ప్రజలు అపోహలను నమ్మవద్దని అధికారికంగా ప్రకటించింది.

Read Also: TG Oil Palm Price: పెరిగిన ఆయిల్ పామ్ ధరలు.. రైతుల్లో కొత్త ఉత్సాహం

HPV Vaccine: No more misconceptions about HPV vaccine.. Central government clarity

అపోహలు వద్దు..

ఈ వ్యాక్సిన్ కొత్తగా కనిపెట్టినదేమీ కాదని, 2006 నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని గుర్తు చేసింది. 2022 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని, అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ఈ టీకా భద్రతను, సమర్థతను ధృవీకరించాయని స్పష్టం చేసింది.

గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో, ఈ వ్యాక్సిన్ ఒక వరమని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా 14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా అందించడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా 93% నుండి 100% వరకు రక్షణ లభిస్తుందని వైద్య నిపుణుల పరిశోధనల్లో తేలిందని వెల్లడించింది. ఎలాంటి భయం లేకుండా అర్హులైన బాలికలకు వ్యాక్సిన్ వేయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cervical Cancer Prevention Health Ministry HPV Vaccine Vaccine Awareness Womens Health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.