The Kerala Story 2: ‘కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రేపు (ఫిబ్రవరి 27, శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు న్యాయస్థానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Vijay Rashmika Marriage: ఒకటైన ‘గీత గోవిందం’ జంట
మత ఉద్రిక్తతల ఆరోపణలు.. పిటిషనర్ల వాదన
ఈ సినిమా కంటెంట్ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది.
15 రోజుల విరామం.. తదుపరి విచారణపై ఉత్కంఠ
విడుదలకు ముందు భారీగా ప్రమోషన్లు, పంపిణీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలకు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే పలుచోట్ల మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్‌ను రద్దు చేయాల్సి రావడం వారికి ఆర్థికంగా నష్టం కలిగించనుంది. గతంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా వివాదాల్లో చిక్కుకుంది.
కేరళలో అధికారంలో ఉన్న వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ప్రస్తుతానికి సినిమా భవితవ్యం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఈ 15 రోజుల స్టే తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, సినిమా యథావిధిగా విడుదలవుతుందా లేదా మార్పులతో వస్తుందా అనేది వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: