📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gold Rate Today: యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పసిడి ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి. ఆదివారం (మార్చి 1, 2026) బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వెలువడటంతో మార్కెట్లో ఒక్కసారిగా అలజడి మొదలై ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Read Also: Hyderabad Gas Rates: హోలీ పండుగ వేళ పెరిగిన గ్యాస్ ధరలు

ఒక్కరోజే రూ. 4 వేల పెరుగుదల.. హైదరాబాద్‌లో సరికొత్త రికార్డు

ఒక్కరోజే గోల్డ్ రేటు రూ.4 వేలకుపైగా పెరిగి షాకిచ్చింది. నెల ప్రారంభంలోనే మార్చి 1న బంగారం ధరలు పెరగ్గా.. సోమవారం బంగారం ధరలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఆదివారం బంగారం ధర రూ.4 వేలకుపైగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,73,080 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,68,710గా ఉండగా.. ఈ రోజు రూ.4,370 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు ఇప్పుడు రూ.1,58,650గా ఉండగా.. శనివారం రూ.1,54,650 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.4 వేలు పెరిగింది.

Gold prices are skyrocketing

ఇతర రాష్ట్రాల్లో ధరలు

ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,72,090గా ఉండగా.. శనివారం రూ.1,69,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2450 పెరిగింది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750గా ఉండగా.. నిన్న రూ.1,55,500 వద్ద స్థిరపడింది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,73,080గా ఉండగా.. నిన్న రూ.1,68,710 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,58,650గా ఉండగా.. నిన్న రూ.1,54,650 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,73,230గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,58,800గా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.