📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Family members missing: ఒకే కుటుంబ లో నలుగురు సభ్యులు అదృశ్యం

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Family members missing: శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో (Sri Sathya Sai District) వేధింపులు తాళలేక ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. రొళ్ల మండలం హెళ్లి వడ్రహట్టిలో ఉంటున్న రామప్ప, సుబ్బమ్మ దంపతులకు నలుగురు సంతానం. రామప్ప ఇప్పటికే మృతి చెందారు. మూడో కుమార్తె లక్ష్మీ అదే గ్రామానికి (హెచిటి హళ్లి వడ్రహట్టి) చెందిన వీరేష్ను ఇష్టపడటంతో 13 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. అయితే ఏడాదిగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదే విషయంపై రెండు మూడు సార్లు పెద్ద మనుషుల సమక్షంతో పాటు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేసినా వీరేష్లో ఎలాంటి మార్పు రాలేదు.

Read Also: Agriculture Electricity subsidy: విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

Family members missing: Four members of the same family missing

కుటుంబ కలహాలు

గత నెల 27న ఉదయం వీరేష్, భార్య లక్ష్మీతో గొడవ పడ్డారు. ఇంట్లోనే ఉంటే నీఅంతు చూస్తానని ఆమెను భర్త బెదిరించాడు. వీటినన్నింటిని గమనించిన తల్లి సుబ్బమ్మ కుమార్తె లక్ష్మీతో పాటు మనవరాళ్లు రోహిణి, రచనలతో అదే రోజు రాత్రి మనవరాళ్లతో కలిసి తల్లీకూతుళ్లు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. గత నాలుగు రోజులుగా అన్నిచోట్లా గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సుబ్బమ్మ పెద్ద కుమార్తె పార్వతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌతమి తెలిపారు. ఇదే ఘటనపై ఎస్ఐ గౌతమిను వివరణ కోరగా దర్యాప్తుల్లో ఎలాంటి అంచుకి లభ్యం కాలేదు అన్నారు. త్వరలోనే గుర్తిస్తామని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.