ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) చుట్టూ జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం ముదురుతోంది. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ రహస్య పత్రాల్లో బిల్ గేట్స్‌పై విస్తుపోయే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఎప్‌స్టీన్ తనకి తాను రాసుకున్న ఈమెయిల్స్ ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. రష్యన్ అమ్మాయిలతో శృంగారం(sex) లో పాల్గొనడం వల్ల బిల్ గేట్స్‌కు లైంగిక సంక్రమణ వ్యాధి (STD) సోకిందని ఎప్‌స్టీన్ తన మెయిల్స్‌లో పేర్కొన్నారు. తనకు సోకిన వ్యాధి గురించి భార్య మిలిండాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని, ఆమెకు రహస్యంగా ఇవ్వడానికి తన వద్ద యాంటీబయోటిక్స్ కావాలని బిల్ గేట్స్ అడిగినట్లు ఎప్‌స్టీన్ ఆరోపించారు.
Hyderabad crime: ప్రాణం బలిగొన్న బోండా
ఇవన్నీ పూర్తిగా అబద్ధం, అర్థరహితమైన ఆరోపణలు
గతంలో బిల్ గేట్స్ ఒక రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్‌తో ఎఫైర్ పెట్టుకున్నారని, ఆ విషయాన్ని బయటపెడతానని ఎప్‌స్టీన్ ఆయనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలన్నీ ఎప్‌స్టీన్ రాసుకున్న డ్రాఫ్ట్ మెయిల్స్ మాత్రమేనని, వీటికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణలపై బిల్ గేట్స్ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ పూర్తిగా అబద్ధం, అర్థరహితమైన ఆరోపణలు.
బిల్ గేట్స్, మిలిండా దంపతులు 2021లో విడాకులు
బిల్ గేట్స్, మిలిండా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లోనే ఎప్‌స్టీన్ తో బిల్ గేట్స్ సన్నిహితంగా ఉండటం వల్లే తాము విడిపోతున్నట్లు మిలిండా పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాజాగా ఈ ఫైల్స్ బయటకు రావడం ఆమె వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది. 2019లో ఫెడరల్ సెక్స్-ట్రాఫికింగ్ కేసులో అరెస్టయిన ఎప్‌స్టీన్, విచారణ ఎదురుచూస్తుండగానే న్యూయార్క్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: