Ranya Rao Gold Smuggling: నటి రన్యా రావు పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

Read Time:  1 min
Ranya Rao Gold Smuggling: నటి రన్యా రావు పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
FONT SIZE
GET APP

Ranya Rao Gold Smuggling: మొన్నటి వరకు కన్నడ వెండితెరపై మెరుస్తూ అభిమానులను సంపాదించుకున్న నటి రన్యా రావు, ఇప్పుడు కటకటాల వెనుక స్మగ్లింగ్ రాణిగా వార్తల్లో నిలిచారు. సుమారు రూ. 102 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమె ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. సినీ గ్లామర్ వెనుక ఉన్న చీకటి దందాను బయటపెట్టిన ఈ కేసు కర్ణాటక వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.ఈ భారీ స్మగ్లింగ్ సిండికేట్‌లో రన్యా రావు పాత్రపై పక్కా ఆధారాలతో బెంగళూరులోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధాన నిందితురాలుగా ఈమె పేరును చేర్చడం గమనార్హం.

Read Also: Komali Suicide: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు

ప్రధాన నిందితురాలిగా రన్యా రావు

ఈక్రమంలోనే ఈడీ దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యా రావు కేవలం ఒక క్యారియర్ మాత్రమే కాదని.. ఈ సిండికేట్‌లో ఆమె ఒక వ్యవస్థీకృత భాగస్వామి అని తేలింది. ముఖ్యంగా కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే ఆమెకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు కమిషన్ ముట్టేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె అరెస్ట్ తర్వాత భర్తతో కలిసి నివసిస్తున్న నివాసంలో సోదాలు చేయగా.. రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి.

ED chargesheet against actress Ranya Rao
ED chargesheet against actress Ranya Rao

అయితే స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును నటి రన్యారావు హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో రన్యారావుతో పాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన బంగారు వ్యాపారి సాహిల్ సకారియా జైన్ పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. ప్రస్తుతం రన్యా రావు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇప్పటికే ఆమెకు రూ. 102 కోట్ల జరిమానా విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.