📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: కుప్పకూలిన డాలర్.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: February 21, 2026 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అలజడి మొదలైంది. అమెరికాలో జరిగిన కీలక పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. డాలర్ కుప్పకూలగా Gold ధరలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ (Trump) తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అధికారం చెలాయించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే ఇదే సమయంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ మీద సుంకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలను విధిస్తూ తాజా ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో ఒక్కసారిగా అనిశ్చితి పెరిగింది అదే సమయంలో డాలర్ బలహీనపడటం, భవిష్యత్ వడ్డీ రేట్లపై ఊహాగానాలు పెరగడం వల్ల Gold ధరలు గణనీయంగా పెరిగాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.

Read Also: AI Effect: ఏఐ దెబ్బకు ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

America: The dollar collapsed.. Trump drowned the hearts of gold lovers

సుప్రీంకోర్టు తన తీర్పులో..

ఫెడరల్ అత్యవసర అధికారాల చట్టాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా “పరస్పర” సుంకాలు విధించడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని మించారని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ట్రంప్ రెండో పదవీకాలంలో అమలు చేసిన అనేక సుంకాలను చెల్లనివిగా చేసింది. దీని ప్రభావంగా.. ఇప్పటికే దిగుమతిదారులు చెల్లించిన భారీ మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి అమెరికా ట్రెజరీపై రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది ప్రభుత్వ బడ్జెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచి.. లోటును పూడ్చేందుకు ద్రవ్య విధానాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తెచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం ఏర్పడితే.. వడ్డీ చెల్లించని బంగారం వంటి లోహాలకు ఇది అనుకూలంగా మారుతుందని మార్కెట్ అంచనా.

బంగారం, వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయి..

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఈ పరిణామాల మధ్య డాలర్ విలువ సుమారు 0.3 శాతం వరకు పడిపోగా.. గ్రీన్‌బ్యాక్‌లో ధర నిర్ణయించే బంగారం ధర ఒక దశలో 1.6 శాతం వరకు పెరిగింది. కోర్టు తీర్పు తక్షణ పరిష్కారాన్ని ఇవ్వకపోవడం.. దిగువ కోర్టుల్లో సుదీర్ఘ న్యాయపోరాటాలకు దారితీయడం వల్ల ఈ అనిశ్చితి మరింత కాలం కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ట్రంప్ ఈ తీర్పును తీవ్రంగా విమర్శిస్తూ, తిరస్కరించబడిన సుంకాల స్థానంలో ఇతర చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద ప్రపంచవ్యాప్తంగా 10 శాతం సుంకాన్ని విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ చర్యతో పాటుగా.. సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియంపై జాతీయ భద్రతా సుంకాలు, అలాగే సెక్షన్ 301 కింద చైనా వస్తువులపై ఉన్న సుంకాలు కొనసాగుతాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Currency Devaluation Dollar Collapse Economic crisis global markets Gold Investors Gold prices Latest News in Telugu Telugu News Paper Trump Impact US Dollar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.