తెలంగాణ(Telangana)లోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.
Read Also: TG Summit 2025: తెలంగాణలో భారీ పెట్టుబడుల ప్రకటన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
రాష్ట్రంలో రాత్రి నుంచి ప్రారంభం అవుతున్న చలి ఉదయం పూట తీవ్ర స్థాయిలో ఉంటోంది. చలి తీవ్రతకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, నిర్మల్ వంటి జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోతున్నాయి. చలిగాలుల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల అదనపు శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే క్రమంలో ఉదయం వేళల్లో, రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. పొగమంచు, చలి కారణంగా వాహనదారులు కూడా రహదారులపై పలు జాగ్రత్తలు పాటించి ప్రయాణించాలని హెచ్చరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: