CM Chandrababu: అకాల వర్షాల నష్టంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. సీఎం

Read Time:  1 min
CM Chandrababu: అకాల వర్షాల నష్టంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. సీఎం
FONT SIZE
GET APP

CM Chandrababu: ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులకు తక్షణం నష్ట పరిహరం అందించే దిశలో అధికారులు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అంచనావేసారు. పంట నష్టాన్ని సత్వరం అంచనావేసి, అంతే వేగంగా రైతులకు నష్ట పరిహరం అందివ్వాలన్నారు. ఈ విషయంలో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు అత్యంత సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

AP Fire Department: అగ్నిమాపక శాఖలో మంటలార్పే డ్రోన్లు, రోబోలు!

CM Chandrababu: అకాల వర్షాల నష్టంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. సీఎం
CM Chandrababu: Report on damage caused by unseasonal rains should be submitted within 48 hours.. CM

    CM Chandrababu: ఇప్పటిదాకా నష్టం రూ.63 కోట్లు

    12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా లెక్కగట్టారు. అలాగే 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో ఉద్యాన పంటలపైనా వర్షాలు ప్రభావం చూపాయన్నారు. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినగా… నష్టం విలువ రూ.23 కోట్లుగా అంచనా వేశారు.

    ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం అన్ని పంటలకు కలిపి మొత్తం నష్టం రూ.63 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. మరోవైపు ఎల్పీజీ సరఫరాపైనా సీఎం సమీక్షించారు. ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా మధ్య మరి కొన్నాళ్లు యుద్ధం కొనసాగితే… ఎల్పీజీ గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా రాష్ట్రంలో సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు.

    ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వం

    ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also :

    Saritha

    రచయిత గురించి

    Saritha

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.