📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Karnataka: లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమా(Dr. Chandru Lamani) ని పట్టుబడ్డారు. కోర్టులో హజరుపరచగా మార్చి 3వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. గదగ్ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, గడగ్ జిల్లాలోని సంకదల్ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న అడ్డుగోడ నిర్మాణానికి దాదాపు రూ.కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా. దీనిని అమలు చేసేందుకు శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కమిషన్​ను డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ విజయ పూజారాను రూ.11 లక్షల లంచం ఇవ్వాలని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనను రూ.11లక్షలు లంచం అడిగారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేను రెడ్​ హండెడ్​గా పట్టుకునేందుకు ఒక ప్లాన్ చేశారు. దాని ప్రకారం శనివారం గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలోని ఎమ్మెల్యే యాజమాన్యంలోని బాలాజీ ఆసుపత్రిలో రూ.5లక్షల లంచం ఇచ్చేందుకు కాంట్రాక్టర్ వెళ్లాడు. లోకాయుక్త అధికారులు కూడా అక్కడే ఉన్నారు. రూ.5లక్షలు తీసుకుంటుండగా, లోకాయుక్త పోలీసులు ఎమ్మెల్యేను పట్టుకున్నారు.

Read Also: Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

Karnataka: BJP MLA remanded in judicial custody in bribery case

కావాలనే ఎమ్మెల్యేపై పన్నిన కుట్ర

అయితే అధికారుల దాడి సమయంలో పీఎ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలోకి ఒక కాగితంలో రూ.50,000 నోట్ల కట్టను విసిరాడు. వెంటనే లోకాయుక్త అధికారులు అక్కడికి చేరుకుని పీఏ విసిరిన డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లోకాయుక్త అధికారుల దాడి వార్త తెలియగానే, ఎమ్మెల్యేల మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాలాజీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఇది కావాలనే ఎమ్మెల్యేపై పన్నిన కుట్ర అని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి గందరగోళం సృష్టించే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ప్రజలను అక్కడి నుంచి చెదరగొట్టారు. శనివారం రాత్రే ఎమ్మెల్యే చంద్ర లమానీ, ఆయన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకువచ్చారు. అంతేకంటే ముందు గడగ్​ జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వారికి మార్చి 3 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఆ తర్వాత ఆయన్ను పరప్పన అగ్రహారంలోని బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anti corruption probe BJP MLA judicial custody Bribery case India Corruption allegations politician Court remand news Indian political controversy Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.