Japan Punch: ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

Read Time:  1 min
ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ 'పంచ్' కు పెరుగుతున్న ఆదరణ..
ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ 'పంచ్' కు పెరుగుతున్న ఆదరణ..
FONT SIZE
GET APP

మనుషులే కాదు జంతువులు కూడా ప్రేమ కోసం పరితపిస్తాయి. వాటికి మనలాగే భావోద్వేగాలు ఉంటాయి.
మనకున్న అన్నీ ఫీలింగ్స్ వాటికి కూడా ఉంటాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తున్నది.
జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఉన్న ఏడు నెలల బేబీ జపనీస్ మాకాక్ కోతి ‘పంచ్’(Punch) ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తల్లి తిరస్కరించడంతో జూ సిబ్బంది దాన్ని పెంచారు. ఇతర కోతులు దాన్ని దగ్గరికి రానీయకపోవడంతో, పంచ్ ఒక స్టప్ట్ ఆరెంగుటాన్ బొమ్మను గట్టిగా పట్టుకుని ఓదార్పు పొందుతున్న
వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత వచ్చిన కొన్ని వీడియోల్లో పెద్ద కోతులు పంచ్ ను లాగడం, కొట్టడం వంటి సీన్లు కనిపించడంతో ‘బుల్లింగ్’ అని భావించి నెటిజన్లు భారీగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోలు చూసిన ఇన్ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్, సోదరుడు ట్రిస్టన్ టేట్ అతని సోదరుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ కోతి ఏ జూలో ఉంది? నేను దాన్ని కొనేస్తాం, దాదాపు రూ 2కోట్లు. నేను జోక్ చేయడం లేదు’ అని పోస్టు చేశారు. ఈ పోస్ట్ కొద్ది రోజుల్లోనే 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో దీనిపై సోషల్ మీడియాలో భారీ డిబేట్ మొదలైంది. కొందరు టేట్ బ్రదర్స్ దాన్ని రెస్క్యూ చేయాలని సపోర్ట్ చేశారు. మరికొందరు జూలోనే ఉంచి సరైఐన కేర్ ఇవ్వాలని, డబ్బుతో కొనడం సరికాదని అంటున్నారు. కొందరు ఆ డబ్బు జూకు డొనేషన్లు చేయాలని సూచిస్తున్నారు.

Read Also: Thalapathy Vijay: ‘జననాయగన్’ విడుదలకు తప్పని అడ్డంకులు

Japan Punch: Baby Monkey Star 'Punch' is gaining popularity, which is shaking up the internet..
Japan Punch: Baby Monkey Star ‘Punch’ is gaining popularity, which is shaking up the internet..

ఇంతకీ దీని కథ ఏమిటి?

ఇటీవల ఓ చిన్న కోతి పిల్ల తన తల్లి కోసం పరితపించిన ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోట్లాదిమంది హృదయాలను కదిలించిన పంచ్ అనే పేరు ఉన్న కోతి పిల్ల కథ విషయానికి వస్తే… తల్లి చనిపోయి ఒంటరైన కోతిపిల్ల జపాన్‌లోని ఒక జూలో జన్మించిన ఈ కోతి పిల్లకు “పంచ్” అనే పేరు పెట్టారు. జన్మించిన కొద్దికాలానికే తల్లి దూరమవడంతో పంచ్ తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లింది. తల్లి ప్రేమ కోసం తపించిన ఆ కోతి పిల్ల పరిస్థితి చూసి జూ సిబ్బంది కూడా భావోద్వేగానికి లోనయ్యారు. దానిని వారు చాలా ప్రేమగా చూసుకున్నారు. అయితే అది తమ జాతి కోతులతో కలవాలని అప్పుడే దాని ఒంటరితనం పోతుందని భావించారు. మరిన్ని కనుగొనండి ట్రావెల్ ప్యాకేజీలు వాతావరణ పరికరాలు మేడ్ ఇన్ ఇండియా బ్యూటీ ప్రొడక్టులు వార్తా సేవ టెక్నాలజీ గాడ్జెట్లు బొమ్మ పట్టుకుని నిద్రిస్తున్న కోతిపిల్ల దానిని ఇతర కోతులతో కలపడానికి ప్రయత్నం చేశారు. పంచ్‌ను మనుషుల సంరక్షణలో పెంచినా, ఇతర కోతులతో కలవడం దానికి సులభం కాలేదు. ఒంటరిగా ఒక మూలన కూర్చోవడం, ఎవరితోనూ కలవకుండా ఉండటం చూసిన అందరినీ కలచివేసింది. అప్పుడు జూ సిబ్బంది ఒక బొమ్మను పంచ్‌కు ఇచ్చారు. ఆ బొమ్మను పంచ్ తన తల్లిలా భావించి గట్టిగా కౌగిలించుకుని నిద్రపోవడం ప్రారంభించింది. వీడియో చూసిన ప్రతీ ఒక్కరిలో భావోద్వేగం ఎక్కడికి వెళ్లినా దానిని పట్టుకుని వెళ్లడం, భయపడ్డప్పుడు లేదా ఒంటరితనం అనిపించినప్పుడు ఆ బొమ్మను గుండెలకు హత్తుకుని ఉండేది. పడుకుని నిద్రించినా కూడా ఆ బొమ్మనే అమ్మలా భావించి దానిని హత్తుకునే పడుకునేది. ఈ హృదయాన్ని తాకే దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.