📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Liquor Scam: మద్యం స్కాం కేసులో అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సిట్

Author Icon By Saritha
Updated: March 16, 2026 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Liquor Scam: ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అవినాశ్ రెడ్డిని కోర్టు అనుమతితో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి, ప్రత్యేక బృందాలు విచారణ ప్రారంభించాయి.

Read Also: Jewelry Shop Theft: రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

AP Liquor Scam: SIT Interrogates Avinash Reddy in Liquor Scam Case

రెండు రోజుల పాటు కొనసాగనున్న విచారణ

అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య అవినాశ్‌రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా జరిగిన భారీ నగదు లావాదేవీల వెనుక అవినాశ్ రెడ్డి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కెసిరెడ్డికి (ఏ1) సమీప బంధువు కావడంతో, అక్రమ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించే బాధ్యతలను ఈయనే చూసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ముఖ్యంగా షెల్ కంపెనీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి, అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధమైన ఆదాయంగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రత్యేక విచారణ గదిలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ రెండు రోజుల పాటు కొనసాగనుంది. రేపు, ఎల్లుండి కూడా ముప్పిడి అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP liquor scam Muppidi Avinash Reddy Raj KC Reddy sit investigation Vijayawada SIT

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.