📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Telugu News: AP: కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం

Author Icon By Sushmitha
Updated: November 6, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)(APSRTC) ప్రక్షాళన దిశగా నూతన పాలకమండలి కీలక అడుగులు వేస్తోంది. సంస్థలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. నిన్న విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.

Read Also: Minister Tummala: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను టీజీ లో కలపండి: తుమ్మల

AP

గత అద్దె బస్సుల ఒప్పందాలపై దృష్టి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి అద్దె బస్సుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 200 అద్దె బస్సుల లీజు పరిమితిని పెంచి, యజమానులకు లబ్ధి చేకూర్చడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని ప్రస్తుత పాలక మండలి అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమీక్షించి, వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది.

ఉద్యోగుల సమస్యలు, విద్యుత్ బస్సులపై చర్చ

రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం(Govt) భావిస్తున్న నేపథ్యంలో, వాటి అమలు సాధ్యాసాధ్యాలపై బోర్డు చర్చించింది. విద్యుత్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఉద్యోగ నియామకాలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

కొత్త డిపో ప్రతిపాదన: ఏలూరు జిల్లా చింతలపూడిలో కొత్త బస్ డిపోను నిర్మించాలని విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ప్రతిపాదించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

APSRTC electric buses Google News in Telugu Konakalla Narayana Rao Latest News in Telugu RTC jobs RTC recruitment Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.