📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Atchannaidu: 15 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు

Author Icon By Rajitha
Updated: March 5, 2026 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Atchannaidu: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రీయ వ్యవసాయం, కౌలు రైతుల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ, 2025-26 క్రాప్ ఇయర్కు రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నారని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.03 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు.

Read also: Chittoor Road Accident: కంటైనర్‌ లారీని ఢీకొట్టిన కారు.. 5గురు దుర్మరణం

Alternative crops in 15 lakh hectares

భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు

అధిక వరి సాగు ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఆధునిక విత్తనాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.

హార్టికల్చర్ హబ్లుగా అభివృద్ధి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, సాగునీటి లభ్యత పెరిగినప్పటికీ వరిపై అధిక ఆధారపడటం రైతులకు గిట్టుబాటు కాదని తెలిపారు. వరిని పూర్తిగా మానేయాలని ప్రభుత్వం చెప్పడం లేదని, అయితే పాత వంగడాల బదులు నాణ్యమైన, ఎగుమతులకు అనుకూలమైన కొత్త వంగడాలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటి దశలో రాయలసీమ జిల్లాల నుండి ప్రకాశం జిల్లా వరకు 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్షన్ చేపట్టి హార్టికల్చర్ హబ్లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 30,000 కోట్లు, ప్రైవేట్ రంగం ద్వారా 70,000 కోట్లు సమీకరించి హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

పంటల వారీగా లాభాల విశ్లేషణ

సంవత్సర కాలంలో రైతులకు వరి పంటలో ఎకరాకు సుమారు 6,000 ఆదాయం మాత్రమే వస్తుండగా, కంది పంటకు 26,000, మినుముల పంటకు 21,000, జొన్న పంటకు 16,000, పామాయిల్ పంటకు 1.50 లక్ష రూపాయల లాభం వస్తుందని వివరించారు. డైవర్షన్కు ముందుకొచ్చే రైతులకు పామాయిలు ఉచిత మొక్కలు, సాంకేతిక సలహాలు, డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించి, పండించిన పంటలను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మొక్కజొన్నకు 2400 మద్దతు ధర ప్రకటించి మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఖరీఫ్ ముందస్తు సాగు మరియు కౌలు రైతుల రుణాలు

ప్రస్తుతం రిజర్వాయర్లలో 90 శాతం నీటి నిల్వలు ఉన్నందున ఖరీఫ్ సాగును రెండు నెలలు ముందుకు తీసుకురావాలని, మే నెలలో ఖరీఫ్ ప్రారంభం అయ్యేలా ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యేలు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. కౌలు రైతుల విషయానికి వస్తే, 9.13 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి 4,474 కోట్లు రుణాలుగా మంజూరు చేశామని వెల్లడించారు. రైతుల ఆదాయ వృద్ధి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh farming Atchennaidu Speech Crop Diversification latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.