Andhra Pradesh: సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Read Time:  1 min
Andhra Pradesh: సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం
FONT SIZE
GET APP

Andhra Pradesh: బీహార్ క్యాడర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయనను ఎపి పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిరాకరించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రక్రియలో లోపాలను కారణంగా చూపుతూ ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. 2024లో ఎపిలో దాఖలైన ఓ ఎఫ్ఎఆర్ లో ఆయన పేరు ఉండటం ఆయన అరెస్టుకు కారణమైంది. 2005 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్. ఎపిలో ఇంటర్ కేడర్ డెప్యుటేషన్పై పనిచేశారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో బీహార్ ఫైర్ అండ్ హోం గార్డ్స్ ఐజిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also: Guntur POCSO Case: పొక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలుశిక్ష

Andhra Pradesh: సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం
Andhra Pradesh: Unexpected development in Sunil Naik’s arrest

రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు

2021లో తనను అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని, హత్యాయత్నం చేశారని, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, ఇప్పటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. 2024లో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వారిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపిసి సెక్షన్ 307 కింద సునీల్ నాయక్ సహా మరికొందరు పోలీసులపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. అనంతరం సునీల్ నాయక్ తన మాతృ రాష్ట్రానికి తిరిగివెళ్లారు.

ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఎపి పోలీసులు బీహార్ వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో నాయక్ను ఆయన అధికారిక నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్ కోసం పాట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ నాయక్ను అరెస్టు చేసిన పద్ధతిపై హోమ్ గార్డ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి వ్యతిరేకంగా నాయక్ నివాసం వద్ద నిరసన తెలిపారు. పాట్నా ఈస్ట్ సిటీ ఎస్పీ భానుప్రతాప్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ఈ సంఘటన గురించి పాట్నా పోలీసులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో హైకోర్టు దీనిని ప్రక్రియ లోపంగా పరిగణించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.