Ambati Rambabu : అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. గుంటూరు నవభారత్ నగర్‌లో ఉన్న అంబటి నివాసాన్ని వందలాది మంది కార్యకర్తలు ముట్టడించారు.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు
ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనల్లో కార్యకర్తలు అంబటి వెంటనే బహిరంగంగా చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు ఆగ్రహంతో ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసరడంతో పాటు బయట ఉన్న కారును ధ్వంసం చేశారు. మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అంబటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: