రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి మార్చి నెలలోనే ఇంతలా ఎండలు మండిపోతుంటే, ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏమిటో ఊహిస్తేనే కలవరం పెరుగుతోంది. మరి ఇంతటి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు వేసవిలో ఎక్కువ మంది కూలర్లు(Coolers) అద్దెకు తీసుకుంటున్నారు. వీటిని కొనడం కంటే రెండు నెలలు అద్దెకు తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు యువకులు, విద్యార్థుల నుంచే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: Iran Israel War: ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?
నెలకు రూ.500 నుంచి రూ.1,500
కొత్తదైతే రూ. 15 వేలు, రెంట్ అయితే రూ.500 : కొత్త కూలర్ మార్కెట్లో కొనాలంటే వాటి ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అదే అద్దెకు తీసుకుంటే కేవలం నెలకు రూ.500 నుంచి రూ.1,500తో సరిపోతుండటంతో ఎక్కువ మంది దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్, ఆశోక్‌నగర్, అమీర్‌పేట, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీలో అద్దె కూలర్లకు భారీగా డిమాండ్ ఉంది. ఈ మార్కెట్లో అసెంబుల్డ్ కూలర్లు రూ.1,500, అంతకన్నా పెద్దవి అయితే రూ.3000 – 4,500 వరకు బయట అందుబాటులో ఉన్నాయి. 3 నెలల కోసం రూ.వేలల్లో అవసరమా? మనం ఎండకాలంలోనే ఎక్కువగా కూలర్లను వాడుతుంటాం. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి మూలన పడేస్తాం! మళ్లీ వాటిని వచ్చే ఏడాదిలో వినియోగించే సమయానికి అవి పని చేయకపోవడం పరిపాటిగా మారుతోందని వినియోగదారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: