📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor Ravi Krishna: నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 5:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రవికృష్ణ సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రవికృష్ణ. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో దుర్గ పాత్రతో టీవీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు, ఇక వెండితెరపై విరూపాక్ష(Virupaksha) సినిమాలో భైరవ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టాడు. (Actor Ravi Krishna) అలాగే ఇటీవలే దండోరా చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజ జీవితంలోనూ కులపిచ్చి వల్ల తన కెరియర్‌లో ముందుకు రాలేకపోయాడు రవి కృష్ణ. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ కులంపై గొంతెత్తే స్థాయి తనది కాదని.. అయినా కులం కారణంగా తాను ఏం కోల్పోయాడో చెప్పుకొచ్చాడు రవి కృష్ణ. రవికృష్ణ తన వృత్తిని సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించాడు. మొదట్లో రోజుకు 50 రూపాయలు ఇచ్చేవారని అని తెలిపాడు. నటుడిగా మారిన తర్వాత రోజుకు 750 రూపాయలు వరకు చేరుకున్నారు. మొగలిరేకులు సీరియల్‌లోని దుర్గ పాత్ర ఆయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.

Read also: TG: బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం

ఇండస్ట్రీలో కుల వివక్ష ఒక చేదు అనుభవం అన్నా రవికృష్ణ

సీరియల్స్‌లో చిన్న విరామం లభించినప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. అక్కడి నుండి సినిమాల పై దృష్టి సారించి, విరూపాక్షలో మంచి అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, ఇండస్ట్రీలో కుల వివక్ష ఒక చేదు అనుభవంగా మిగిలిందని అన్నాడు రవికృష్ణ. కులం కారణంగా సినిమా ఆఫర్స్ కోల్పోయాను అని అన్నాడు. (Actor Ravi Krishna) సినిమా ఆఫర్స్ వచ్చినపుడు అగ్రిమెంట్ చేయటానికి నా పేరు ఇవ్వండి అని అడిగినప్పుడు. తన పాన్ కార్డు లేదా ఆధార్ పంపిన తర్వాత తన పూర్తి పేరు, ఇంటిపేరు తోట చూసి కొన్ని ప్రాజెక్టులు తన చేజారినట్లు ఆయన వెల్లడించాడు. ఈ విధంగా మూడు, నాలుగు ప్రాజెక్టులను కోల్పోయానని తెలిపాడు. కొందరు దర్శకులు నేరుగా చెప్పకుండా హీరో కంటే నువ్వు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నావు వంటి కారణాలు చూపించి అవకాశాలు నిరాకరించినట్లు పేర్కొన్నాడు. టెలివిజన్ నటుడిగా సినిమాలకు మారినప్పుడు కూడా అనేక వివక్షలను ఎదుర్కొన్నట్లు రవికృష్ణ తెలిపాడు. నువ్వు సీరియల్ నటుడివి కదా.! చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకో. ఇక్కడ హీరో అవ్వాలని మైండ్‌లో పెట్టుకోకు అని కొందరు అన్నారని తెలిపాడు. విరూపాక్ష తర్వాత అంతా మారిపోయింది. ప్రస్తుతం తనను ఒక నటుడిగా పరిశ్రమ ఆదరిస్తోందని తెలిపాడు రవికృష్ణ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Actor Interview Career Struggles Caste Discrimination Film Industry Ravi Krishna Actor Television to Film Telugu cinema Virupaksha Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.