📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nandigama bribery case : ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు, నందిగామలో లంచం కేసు

Author Icon By Sai Kiran
Updated: January 7, 2026 • 9:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏసీబీ వలలో వరుసగా ముగ్గురు అధికారులు మొదట ₹5 లక్షల లంచం డిమాండ్.. చివరకు ₹2.5 లక్షలకు డీల్అ డ్వాన్స్‌గా ₹1.5 లక్షలు, మిగతా ₹1 లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్

Nandigama bribery case : రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు సంచలన ఆపరేషన్ నిర్వహించారు. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సంబంధించి లంచం డిమాండ్ చేసిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

స్థానికంగా ఓ వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీడీవో సుమతి కలిసి తొలుత ₹5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడితో చర్చల అనంతరం లంచం మొత్తాన్ని ₹2.5 లక్షలకు తగ్గించారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ₹1.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్న అధికారులు, మిగిలిన ₹1 లక్షను బుధవారం స్వీకరిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ (Nandigama bribery case) డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే దాడులు నిర్వహించి ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, లంచం వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతుల విషయంలో లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.