AB de Villiers: ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్

Read Time:  1 min
AB de Villiers: ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్
FONT SIZE
GET APP

AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీకి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీయే మూలస్తంభమని, అతడే జట్టుకు గుండెకాయ వంటివాడని ఆ జట్టు మాజీ సూపర్‌స్టార్ ఏబీ డివిలియర్స్ ప్రశంసించాడు. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలో అతను కనబరిచే ఉత్సాహం, నాయకత్వ పటిమ జట్టుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్ లో తొలిసారిగా ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన ఆర్సీబీ, ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: Ravichandran ashwin retirement : నా టైమ్ అప్పుడే ముగిసింది- అశ్విన్

AB de Villiers: ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్
AB de Villiers: Virat Kohli is the heart of RCB: AB de Villiers

జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “సంవత్సరాలుగా బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడమే కాదు, తన ఉనికితో, ఎనర్జీతో జట్టుకు విరాట్ ఇప్పటికీ ప్రాణం పోస్తున్నాడు. జట్టు గెలుపు కోసం మైదానంలోనూ, వెలుపలా అతను పోరాడే తీరు ప్రశంసనీయం. అతని ఉత్సాహం యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతుంది. మనం కచ్చితంగా ట్రోఫీ గెలవగలం అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. గతేడాది ఆర్సీబీ విజయంలో ఇదే కీలకపాత్ర పోషించింది” అని డివిలియర్స్ తెలిపాడు.

“గతంలో ఆర్సీబీ ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడేది. కానీ, గత సీజన్‌లో ఆ పరిస్థితి మారింది. జట్టు మొత్తం సమష్టిగా రాణించింది. కోహ్లీ ఓపెనర్‌గా ప్రధాన స్కోరర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ, మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకున్నారు. ఫైనల్ మ్యాచే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కానీ, రజత్ పాటిదార్, లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి వారు వేగంగా ఆడి జట్టు స్కోరును 190 దాటించారు. గత సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శనను గుర్తుచేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.