1629299 kishan reddy

రేవంత్ 14 నెలల పాలన పై కిషన్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి మరియు బీజేపీ నేత కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రేవంత్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రస్తావిస్తూ, వారి డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం అమానుషమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కళాశాలలు నిధుల కొరత

ఉద్యోగుల మౌలిక హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులపై సీలింగ్ విధించడం తగదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కళాశాలలు నిధుల కొరతతో మూతబడే పరిస్థితికి చేరుకున్నాయని విమర్శించారు. విద్యా రంగానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్య వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు.

అభివృద్ధి ప్రణాళికలు ఆగిపోయాయి

ఇదే సమయంలో, రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ మరింత దూకుడుగా విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి నిధులు సక్రమంగా వినియోగించకపోవడంతో, అభివృద్ధి ప్రణాళికలు ఆగిపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు పార్టీ ముందుకు వస్తుందని ప్రకటించారు.

Related Posts
స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
stalin govt kishan reddy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. భారతదేశ భాషా Read more

పార్టీ మార్పు పై స్పందించిన డీకే శివకుమార్
DK Shivakumar reacts on party change

కర్ణాటక: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. బీజేపీ వాళ్లే తనతో టచ్ లో ఉన్నారని Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

హీరోలపై కాదు.. మీ లైఫ్పై దృష్టి పెట్టండి: అజిత్
Ajith hero

హీరోల జీవితాలపై కాకుండా తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు సూచించారు. తన అభిమానులు తమ జీవితంలో విజయవంతమైతే Read more