Kishan Reddy comments on cm revanth reddy

రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. ప్రజా తీర్పు.. కాంగ్రెస్‌ పాలనకు చెంపపెట్టులాంటిది.

Advertisements
రేవంత్‌ గాలి మాటలకు జవాబు

జీవో 317 కారణంగా ఇబ్బందులు

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కుల గణనపై విమర్శలు

కాగా, బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కుల గణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ ఫైర్​ అయ్యారు. కుల గణనలో పాల్గొనాలని కేసీఆర్ ను, కేటీఆర్​ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని నిలదీశారు. కుల గణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కుల గణనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Related Posts
Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్
Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది Read more

IPL 2025 : IPLలో ఈరోజు ధూమ్ ధాం 2 మ్యాచులు
GTvsDC

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈరోజు అభిమానులకో డబుల్ ధమాకా మ్యాచ్‌ల రోజు. మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ Read more

పరువునష్టం కేసు.. విచారణకు హాజరైన కొండా సురేఖ
పరువునష్టం కేసు.. విచారణకు హాజరైన కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్.హైదరాబాద్‌ : హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. Read more

సుకుమార్‌పై ఐటీ కొరడా
director Sukumar

ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ Read more

×