📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Funny Telugu story: నొప్పింపక.. తానొవ్వక

Author Icon By Hema
Updated: July 18, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భర్త లేకున్నా భార్య ఎక్కువ కాలం బతుకుతుంది”అనే వ్యాసాన్ని సీరియస్ గా  చదువుతూ ఉన్నాడు నందగిరి. సర్వీసు చేసి చేసి టైర్డ్ అయ్యాడని రిటైర్ చేశారు బ్యాంకువారు మేనేజర్ నందగిరిని. పిల్లల చదువుల కోసం ఫ్యామిలీని తిరుపతి(Thirupathi) లోనే పెట్టి దక్షిణ రాష్ట్రాలన్నీ(Western States) తిరిగి వచ్చాడు. మొగుడి చేత ఏదో ఒక పని చేయించాలనుకుంది నందగిరి భార్య చతురిక. సాన పెట్టకపోతే కత్తి పీట అయినా తుప్పు పడుతుందని గుర్తుకొచ్చింది. చతురికకు. చిన్నగా వచ్చి “ఏమండీ! ఈరోజు టిఫన్   గుమగుమలాడే  నెయ్యి వేసి పెసలవప్పు పొంగలి చేసుకుందాం. ఇంట్లో పెసలపప్పు ఎక్కువ లేదు. పక్క వీధిలో సుగుణక్క అంగడి ఉంది. వెళ్లి కేజీ పప్పు తీసుకుని రండి” అని నెమ్మదిగా చెప్పింది.

లుంగీ ఎగగట్టి చిన్నగా లేచి నిలబడ్డాడు నందగిరి. అద్దం ముందర నిలబడి మీసాలు దువ్వుతూ ఉంటే గుర్తుకొచ్చింది రిటైర్డ్ సీనియర్ మేనేజర్ మాటలు.. “పెన్షనర్ అంటే ఇంట్లో వాళ్లందరికీ లోకువే. కొంచెం వంగితే పనిమనిషిని మాన్పించి వంట పాత్రలు కూడా మన చేత కడిగిస్తారు” అని. బ్యాగు చేతికి తీసుకుని ఊగుతూ ఊగుతూ బయలుదేరాడు. సుగుణక్క అంగడికి వెళ్ళి పెసలు పట్టుకొచ్చాడు. గ్యాసు స్టవ్ మీద వంటకి కావలసినవి అన్నీ సిద్ధం చేసుకుని మొగుడి కోసం చూస్తూ ఎదురు చూస్తూ ఉంది చతురిక. మొగుడు తెచ్చిన పెసలు చూసి ముక్కు మీద వేలు వేసుకుంది.

“బ్యాంకు శాఖలను ఏలినామంటారు. పెద్ద పెద్ద కస్టమర్లను బుట్టలో పడేసినామని గొప్పలు చెబుతారు. కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించామని శాలువాలు కప్పించుకుంటారు. అట్లాంటిది పెసలపప్పు తెమ్మంటే ముడిపెసలు తెచ్చారేమిటండీ?” అని మెత్తమెత్తగా అడిగింది.

అమాయకంగా ముఖం పెట్టాడు నందగిరి. “అరవై యేళ్ళు పైబడినా ఏమీ తెలియదు ఈయనకు. నేను బతికినంత కాలం ఫర్లేదు. నేను పోయాక ఎలా బతకబోతాడో ఈ పిచ్చిమారాజు” అనుకుని ఇంట్లో ఉన్న కాసింత పెసలపప్పుతో పొంగలి చేసింది. సెగలు గక్కే పొంగలిలోని మిరియాలు పక్కన పెట్టి, జీడిపప్పు ముక్కలను జోరుజోరుగా తిన్నాడు. నందగిరి, నెయ్యితో పాటు ఉడికిన లేత కరివేపాకు ఆకుల్ని ఏరిఏరి కొరికాదు. సాయంత్రం ఆరు గంటలయ్యింది. భార్యాభర్తలు రెండేసి ఉప్పు బిస్కెట్లు తిన్నారు. వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగారు. ఆరోగ్యానికి మంచిదని ఇద్దరూ ఈవెనింగ్ వాక్కి పార్కుకు బయలుదేరారు. పోతూ పోతూ పక్క వీధిలోని సుగుణక్క అంగడి దగ్గర ఆగింది చతురిక. తేలు కుట్టిన దొంగలాగా దూరంగా కానుగచెట్టు కింద నిలబడి దిక్కులు చూడసాగాడు నందగిరి. కోపంగా వెళ్లిన చతురిక “ఏమి సుగుణా! మా ఇంటాయనకంటే పెసలపప్పుకీ, ముడి పెసలకీ తేడా తెలియదు. నువ్వు ఇరవై నాలుగ్గంటలూ సరుకులు అమ్మేదానవు. అన్నీ తెలిసి కూడా మా ఇంటాయనకు ఇవి ఇచ్చావే! ఇన్ని ముడి పెసలు మేమేం చేసుకుంటాం. మాకు పెసలుతో చేసేపెసరట్టు కూడా అలవాటు లేదు. మా ఆయన పేపర్ల పని చేసాడే కానీ పెసలు చూసినోడు కాదు” అని నిష్టూర పడింది. ఏదో

చెప్పాలనుకుంది సుగుణక్క మొగుడూ పెల్లలిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. వారి ఆనందం ఎందుకు పాడు చేసేదని తన నోటికి తానే తాళం వేసుకుంది సుగుణక్కమారు మాట్లాడకుండా ముడిపెనలు తీసుకుని పెసలవప్పు పొట్లం చతురిక చేతికి ఇచ్చింది.ఇద్దరూ అక్కడి నుంచి నవ్వుతూ కదిలారు. తెల్లారి పెసలపప్పు ఇవ్వబోయినా ముడిపెసలు తీసుకెళ్ళిన నందగిరి వైపు చూసింది. ఏమీ తెలియనోడిలాగా ఎగిరెగిరి నడుస్తూ ఉన్నాడు.”రిటైర్ అయిన ఆరు నెలలు పెళ్లాం చెప్పింది రివర్స్లో చేస్తే మనకి పనులెవ్వరూ చెప్పరు. గృహం స్వర్గసీమ అవుతుంది, లేకుంటే కారాగార జీవితం అవుతుంది” అని సీనియర్లు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న నందగిరి జోకులేస్తూ హుషారుగా నడుస్తున్నాడు.

“మా ఇంటాయన పెద్ద పెద్ద కొలువులు చేశాడు కానీ… ప్రతిదానికీ నా మీద ఆధారపడతాడు” అని గర్వంగా ముఖం పెట్టి మొగుడి జోకులకు పడి పడీ నవ్వుతోంది చతురక.

Read Also : Shankar Rao: ఒబిసిల రిజర్వేషన్లకై సిఫార్సు చేయండి: శంకరరావు

couple bonding domestic comedy retirement life Telugu humor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.