పూర్వం కిష్కింధ వనం అనే చిట్టడవిలో పేరుకు తగ్గట్టు కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. అయినా అవి ఏమాత్రం గర్వం లేకుండా ఇతర జంతువులతో సఖ్యతగా మెలగడమే కాదు.. చేరువలో వున్న కారడవిలోని కౄరమృగాలు తమ ప్రాంతంలోకి చొరబడకుండా పగలు రాత్రి కాపలా కాస్తుండేవి. వాటి రక్షణలో నిర్భయంగా తిరిగే లేళ్ళు, కుందేళ్ళను చూస్తుంటే మాంసాహారం అంటే పడి చచ్చే నక్కకు నోరూరిపోయేది. కానీ కోతులకు (monkeys) భయపడి ఏమీ చెయ్యలేక ఏదో ఒక ఉపాయంతో వాటి పీడ వదిలించుకుంటే కోరిన తిండి తనివితీరా తినొచ్చన్న ఆశతో రోజూ చిన్న చితకా జీవుల పక్కన చేరి ఏవో మాయమాటలు చెబుతూ వీలైనప్పుడల్లా అన్నింటినీ ఒకేచోట గుమికూడేలా చేసి “చూశారా మిత్రులారా! ఆ కోతిమూకలకు తమకే పెద్ద బలగం వుందని ఎంత పొగరో! ఈ అడవికి మేమే రాజులం అన్నట్లు మనమీద పెత్తనం చెలాయిస్తున్నాయి. అవి అస్తమానం చెట్ల మీద కుప్పి గంతులేస్తూ అడవిలో(forest) పండిన పళ్లన్నీ లొట్టలేస్తూ మెక్కేస్తుంటే మనం రుచీ పచీలేని గడ్డీ గాదం తింటూ బతకాల్సి వస్తోంది. ఈ అడవి మీద వాటికెంత హక్కుందో మనకూ అంతే హక్కు వుంది. ఎంచక్కా సగ భాగం పంచుకుని మనం.
గుంటనక్క మోసం
వేరుపడి స్వేచ్ఛగా జీవిద్దామంటూ వాటిని రెచ్చగొట్టేది. కొద్ది రోజులకే దాని చెప్పుడు మాటలు తలకెక్కడంతో ఆ అమాయక ప్రాణులు మంచీ-చెడూ ఆలోచించకుండా పంపకాలకు సిద్ధపడుతుండగా.. ఒక ముసలి పావురం రివ్వున ఎగురుతూ వచ్చి వాటి పక్కన వాలి “ఓసి పిచ్చి మొద్దుల్లారా! మీరీ అడవిలో వాటా పంచుకున్న మరుక్షణమే ఈ జిత్తులమారి నక్క పొరుగునే వున్న సింహం, చిరుతల్ని మీ మీదికి వుసిగొల్పి రోజూ అవి తినగా మిగిలే మాంసం ఎముకలతో పండుగ చేసుకోవాలనుకుంటోంది
పావురం హితవు
దీని వాలకం చూసి నాకు ముందే అనుమానం వచ్చి ఓ కంట కనిపెడుతూనే వున్నాను. ఈ రోజు చాటుగా వెంబడించి వాటితో ఇది బేరసారాలు కుదుర్చుకోడం చెవులారా విన్నాను, మీ మంచి కోరి చెబుతున్నా. దీని మోసపు మాటలు నమ్మి కంటికి రెప్పల్లా కాపాడే వానర దండును దూరం చేసుకుని చేతులారా మీ చావు మీరే కొనితెచ్చుకోవద్దని” హెచ్చరించింది. పావురం హిత వాక్యాలు విన్న మరుక్షణం జంతువులన్నీ తమ తప్పు తెలుసుకొని తోటి ప్రాణుల మేలుకోరే మంచి మనసున్న కోతులు మీద లేనిపోని చాడీలు చెప్పి తమ ప్రాణాలకు హాని తలపెట్టిన గుంటనక్క మీద పట్టరాని కోపంతో మూకుమ్మడిగా దాడి చేసి తిరిగి అది ఈ పరిసరాల్లో అడుగు పెట్టేందుకే భయపడేలా గట్టిగా బుద్ధి చెప్పి ఆమడ దూరం తరిమికొట్టాయి.
Read also: hindi.vaartha.com
Read also: